• స్వయం సహాయం

మాన్యువల్ ఆఫ్ ప్రాక్టీస్

1 టెలివిజన్ ఛానల్ డిస్ట్రిబ్యూటర్స్ యొక్క పేరు మరియు అడ్రెస్:

Dish TV India Limited,
Registered Office: Office No. 3/B, 3rd Floor, Goldline Business Centre, Link Road, Malad West, Mumbai 400064, Maharashtra
Corporate Office: FC-19, Film City, Sector 16 A, Noida, 201301

2 టెలివిజన్ ఛానల్ డిస్ట్రిబ్యూటర్ అందించే సర్వీస్ యొక్క నిబంధనలు మరియు షరతులు: ఇక్కడ క్లిక్ చేయండి

3 నోడల్ ఆఫీసర్ యొక్క పేరు, హోదా మరియు ఇ-మెయిల్, సంప్రదింపు టెలిఫోన్ నంబర్, ఫ్యాక్స్ నంబర్ మరియు చిరునామా: వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

4 వినియోగదారు రక్షణ కొరకు కేటాయించిన వివరాలు ఈ నిబంధనలలో పేర్కొన్న విధంగా:-
 

a. టెలివిజన్‌కి సంబంధించి ప్రసార సేవలకు అంతరాయం.—ఒక వేళ సబ్‌స్క్రయిబర్ యొక్క టెలివిజన్ ఛానెళ్ల యొక్క సిగ్నల్స్‌కు డెబ్భై రెండు గంటలకు పైగా అంతరాయం కలిగితే, టెలివిజన్ ఛానెళ్ళ యొక్క డిస్ట్రిబ్యూటర్, అంతరాయం కలిగిన పూర్తి కాలానికి, అటువంటి ఛానెళ్ళ యొక్క డిస్ట్రిబ్యూటర్ రిటైల్ ధర మరియు నెట్‌వర్క్ కెపాసిటీ ఫీజు యొక్క మొత్తానికి సమానంగా సబ్‌స్క్రయిబర్ యొక్క సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలను తగ్గిస్తారు, ఆ తగ్గింపు ఈ నిబంధనలకు లోబడి ఉంటుంది:

సబ్‌స్క్రయిబర్ ఫిర్యాదు చేసిన సమయం నుండి అటువంటి అంతరాయం జరిగిన సమయం లెక్కించబడుతుంది:

ప్రకృతి వైపరీత్యాల వలన జరిగిన అంతరాయనికి సబ్-రెగ్యులేషన్‌లో ఉన్న ఏ నిబంధన వర్తించదు.

b. సబ్‌స్క్రయిబర్లకు ప్రైస్ ప్రొటెక్షన్.— ఒకవేళ, సబ్‌స్క్రయిబర్ టీవీ కు సంబంధించిన ప్రసార సర్వీసులు లాక్-ఇన్ పీరియడ్‌తో సబ్‌స్క్రయిబ్ చేసుకున్నా లేదా డిస్ట్రిబ్యూటర్ ఆఫర్ చేసిన ప్రసార సర్వీసుల స్కీం లో ఒక నిర్దిష్ట కాలానికి ఛార్జీలు ముందుగానే చెల్లించినా, డిస్ట్రిబ్యూటర్ అటువంటి సర్వీసులు ఆ నిర్దిష్ట కాలం పాటు సబ్‌స్క్రిప్షన్ ధరలో ఎటువంటి పెరుగుదల లేకుండగా అందించవలెను మరియు సబ్‌స్క్రయిబర్‌కు ప్రతికూలంగా సబ్‌స్క్రిప్షన్ నిబంధనలు మార్చరాదు.

d. టెలివిజన్‌కి సమబంధించి ప్రసార సేవల నిలిపివేత.—

(1) టివి ఛానెళ్ళ యొక్క ప్రతి డిస్ట్రిబ్యూటర్, సబ్స్క్రైబర్ నుండి టివి కు సంబంధించిన సర్వీసులు యొక్క కనెక్షన్ డిస్కనెక్ట్ చేయుటకు అభ్యర్థన అందుకున్న వెంటనే, ఆ అభ్యర్ధనలో సూచించిన తేదీ నుండి సర్వీసులు డిస్కనెక్ట్ చేయవలెను మరియు సబ్స్క్రైబర్‌కు తమ యొక్క డిపాజిట్స్ వాపసు చేయవలెను, డిస్ట్రిబ్యూటర్ మరియు సబ్స్క్రైబర్ లు అంగీకరించబడిన విధంగా సర్వీసులు అందించడానికి నిబంధనలు మరియు షరతుల ప్రకారం, ఏడు రోజుల లోపు: సబ్స్క్రైబర్ డిస్కనెక్ట్ అభ్యర్థన లో సూచించిన తేదీ నుండి పదిహేను రోజుల ముందుగానే అభ్యర్ధన ఇచ్చి ఉంటే.

(2) ఆ డిస్‍‍కనెక్షన్ కారణాలు సూచిస్తూ పదిహేను రోజుల నోటీసు ఇవ్వకుండా టెలివిజన్ ఛానెళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ ఎవ్వరూ సబ్స్క్రైబర్ యొక్క సర్వీసులు డిస్‍‍కనెక్ట్ చేయకూడదు మరియు ఆ పదిహేను రోజులు సమయం అటువంటి నోటీసు ఇచ్చిన తేదీ నుండి లెక్కింపవలెను.

(3) టీవీ కు సంబంధించిన ప్రసార సేవలను నిలిపివేయు నోటీసు సబ్-నియంత్రణ (2) లో సూచించిన విధంగా టీవీ ఛానెళ్ల డిస్ట్రిబ్యూటర్ టీవీ స్క్రీన్ పై సమాచారాన్ని చూపించవచ్చును మరియు సబ్స్క్రైబర్ రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్‌కు షార్ట్ మెసేజ్ సర్వీస్ (ఎస్ఎంఎస్) పంపవచ్చును:

అంతే కాకుండా, పైన వివరించిన విధంగా నోటీసు పంపడంతో పాటు, ఇతర కమ్యూనికేషన్ పద్దతులు అయిన ఇ-మెయిల్, బి-మెయిల్ మరియు ఇతర ఆమోదయోగ్యమైన పద్దతుల ద్వారా నోటీసు గురించి సబ్స్క్రైబర్‌కు తెలుపవచ్చును అని డిస్ట్రిబ్యూటర్‌కు అనుమతించబడినది.
 

e. ప్రీ-పెయిడ్ బిల్లింగ్ మరియు చెల్లింపు.—
(1) టెలివిజన్ ఛానల్స్ డిస్ట్రిబ్యూటర్ ప్రతి ఒక్కరు, ప్రీ-పెయిడ్ చెల్లింపులు ఐతే, అటువంటి చెల్లింపులు అందినట్లు సబ్స్క్రైబర్ కు ధృవీకరించాలి మరియు సబ్స్క్రైబర్ మేనేజ్‍మెంట్ సిస్టం సరిగ్గా అప్‌డేట్ చేసినట్లు నిర్ధారించుకోవాలి.
(2) ప్రీ-పెయిడ్ చెల్లింపు ఆప్షన్‌లో బిల్లింగ్ సైకిల్ సర్వీసులు యాక్టివేట్ చేసిన తేదీ నుండి ముప్పై రోజులు ఉండాలి.
(3) టీవీ ఛానెళ్ల డిస్ట్రిబ్యూటర్స్ ప్రతి ఒక్కరు, వారి వెబ్‌సైట్‌లో, కనీసం గడచిన ఆరు నెలల కాలానికి సబ్స్క్రైబర్స్ యొక్క బిల్లింగ్ మరియు పేమెంట్‌కు సంబంధించిన రికార్డ్స్ నిర్వహించాలి, మరియు సబ్స్క్రైబర్స్‌కు వారి యొక్క అకౌంట్స్‌కు లాగ్-ఇన్ యాక్సస్ కల్పించవలెను:
అటువంటి సబ్స్క్రైబర్ రికార్డ్స్‌లో ఐటెమ్ వారీగా వాడుక వివరాలు ఉండవలెను, —
(a) నెట్‌వర్క్ కెపాసిటి ఫీజు,
(b) కస్టమర్ ఉంటున్న ప్రదేశంలో ఎక్విప్‍మెంట్ కోసం అద్దె చార్జీలు, ఏమైనా ఉంటే,
(c) బిల్లింగ్ సైకిల్‌లో సబ్స్క్రైబర్ సబ్స్క్రైబ్ చేసుకున్న పే చానెల్స్ మరియు పే చానెల్స్ బొకేలకు సంబంధించిన ఛార్జీలు,
(d) ఈ రెగ్యులేషన్లలో వివరించిన నియమాలకు అనుగుణంగా విధించిన ఇతర ఛార్జీలు మరియు,
(e) వర్తించే చట్టాలకు అనుగుణంగా పన్నులు.
(4) సబ్స్క్రైబర్ యొక్క ప్రీపెయిడ్ అకౌంటులో బ్యాలెన్స్ లేనప్పుడు ప్రీపెయిడ్ సబ్స్క్రైబర్‌కు సేవలను తాత్కాలికంగా నిలిపివేయడానికి టెలివిజన్ ఛానెళ్ల యొక్క డిస్ట్రిబ్యూటర్‌కి అనుమతి ఇవ్వబడింది, దానికి సంబంధించిన నిబంధనలు ఇలా ఉన్నాయి:
ఒకవేళ సబ్స్క్రైబర్ యొక్క సర్వీసులు నిరంతరంగా మూడు నెలలకు పైగా నిలిపివేయబడినట్లయితే, అటువంటి సబ్స్క్రైబర్‌ను డిస్ట్రిబ్యూటర్ యొక్క యాక్టివ్ సబ్స్క్రైబర్‌గా లెక్కించకూడదు మరియు అటువంటి సబ్స్క్రైబర్‌ను తమ సబ్స్క్రైబర్ మేనేజ్మెంట్ సిస్టమ్ నుండి డియాక్టివేట్ చేయుటకు డిస్ట్రిబ్యూటర్‌కు అనుమతి ఇవ్వబడింది:
సబ్స్క్రైబర్ అకౌంటులో బ్యాలెన్స్ మొత్తం రీఛార్జ్ జరిగిన వెంటనే డిస్ట్రిబ్యూటర్ సర్వీసులు ప్రారంభించవలెను మరియు ఒకవేళ అటువంటి సర్వీసులు మూడు నెలల కన్నా ఎక్కువ సమయం నిలిపివేసినట్లయితే, అటువంటి రీస్టోరేషన్ సర్వీస్‌కు డిస్ట్రిబ్యూటర్ వంద రూపాయలకు మించకుండా రి-యాక్టీవేషన్ ఫీజు వసూలు చేయవచ్చును

5 ఫిర్యాదు పరిష్కారానికి విధానం మరియు బెంచ్‌మార్క్:
కస్టమర్ కేర్ సెంటర్ ద్వారా ఫిర్యాదుల నిర్వహణ. - (1) సబ్‌స్క్రయిబర్ నుండి ఫిర్యాదు అందిన ప్రతి సారి కస్టమర్ కేర్ సెంటర్ అటువంటి ఫిర్యాదును రిజిస్టర్ చేసి డాకెట్ నంబర్ అని పిలవబడే ఒక ప్రత్యేక సంఖ్యను కేటాయించేలా టెలివిజన్ ఛానెళ్ల యొక్క డిస్ట్రిబ్యూటర్ నిర్ధారించాలి:
ఒక వేళ అవసరమైతే అథారిటీ అటువంటి డాకెట్ నంబర్ యొక్క ఫార్మాట్‌ని పేర్కొనాలి
(2) టెలివిజన్ ఛానెళ్ళ యొక్క డిస్ట్రిబ్యూటర్ కస్టమర్ కేర్ సెంటర్ ఇక్కడ పేర్కొన్నవి అనుసరించేలా నిర్ధారించాలి-
(a) ఫిర్యాదును రిజిస్టర్ చేసే సమయంలో, డాకెట్ నంబర్, ఫిర్యాదు రిజిస్టర్ చేసిన సమయం మరియు తేదీ మరియు ఫిర్యాదు ఎప్పటి లోగా పరిష్కారం అవుతుందో ఆ సమయం; మరియు
(b) ఫిర్యాదు పరిష్కరించబడిన తరువాత, ఫిర్యాదు పై తీసుకున్న చర్యలను వివరిస్తూ సబ్‌స్క్రయిబర్‌కు సమాచారం అందించడం మరియు ఒక వేళ సబ్‌స్క్రయిబర్‌ సంతృప్తి చెందకపోతే, ఆ ఫిర్యాదును పై భవిష్య కార్యాచరణ కోసం నోడల్ ఆఫీసర్ పేరు మరియు సంప్రదింపు నంబర్.
ఫిర్యాదుల పరిష్కారానికి సమయ పరిమిత.— సబ్‌స్క్రయిబర్‌ల ఫిర్యాదుల పరిష్కారానికి టెలివిజన్ ఛానెళ్ల యొక్క ప్రతి డిస్ట్రిబ్యూటర్ క్రింద ఇవ్వబడిన సమయ పరిమతులకు కట్టుబడి ఉండాలి-
(a) ఫిర్యాదు అందిన ఎనమిది గంటల లోపు అన్ని ఫిర్యాదులకు ప్రతిస్పందన పంపించాలి:
అయితే, కార్యాలయ పని వేళల తరువాత అందిన ఫిర్యాదులకు మరుసటి పని రోజున ప్రతిస్పందన అందించబడుతుంది;
(b) 'సిగ్నల్ లేదు' అని వచ్చే అన్ని ఫిర్యాదులలో కనీసం తొంభై శాతం పరిష్కరించబడాలి మరియు అటువంటి ఫిర్యాదు అందిన ఇరవై నాలుగు గంటలలోపు సిగ్నల్ రీస్టోర్ చేయబడాలి;
(c) బిల్లింగ్‌కి సంబంధించి సబ్‌స్క్రయిబర్‌ నుండి అందుకున్న అన్ని ఫిర్యాదులు, అటువంటి ఫిర్యాదు అందుకున్న ఏడు రోజుల లోపు పరిష్కరించబడాలి మరియు ఏవైనా రిఫండ్‌లు ఉంటే, ఫిర్యాదు అందిన ముప్పై రోజుల లోపు సబ్‌స్క్రయిబర్‌‌కు చెల్లించబడాలి;
(d) క్లాజ్ (b) మరియు క్లాజ్ (c) క్రింద కవర్ చేయబడని ఫిర్యాదులలో కనీసం తొంభై శాతం అటువంటి ఫిర్యాదులు అందిన నలభై ఎనిమిది గంటలలోపు పరిష్కరించబడాలి;
(e) క్లాజ్ (c) లో పేర్కొనబడిన బిల్లింగ్ సంబంధిత ఫిర్యాదులు మినహా ఏ ఫిర్యాదు,