• స్వయం సహాయం

కొత్త కనెక్షన్ కొరకు పద్ధతి

కొత్త కనెక్షన్ కొరకు పద్ధతి.

(1) వినియోగదారుకు కనెక్షన్ అందించే సమయములో టివి ఛానల్స్ యొక్క ప్రతి డిస్ట్రిబ్యూటర్, ఆ-లా-కార్టె ఛానల్స్ లేదా బొకేస్ యొక్క నెలవారి గరిష్ఠ రీటెయిల్ ధర మరియు నెలవారి డిస్ట్రిబ్యూటర్ రీటెయిల్ ధర, నెలవారి నెట్వర్క్ కెపాసిటి ఫీ మరియు కస్టమర్ ప్రిమిసెస్ ఎక్విప్‍మెంట్ ధర, సెక్యూరిటి డిపాజిట్, అద్దె మొత్తము, గారెంటీ/వారెంటీ, నిర్వహణ నిబంధనలు మరియు కస్టమర్ ప్రిమిసెస్ ఎక్విప్‍మెంట్ యాజమాన్యము, వీటితో సహా కాని వీటికే పరిమితం కాకుండా, సర్వీసుల గురించి వర్తించే అన్ని వివరాలను, అతనికి తెలియజేయాలి.

(2) టివి ఛానల్స్ యొక్క ప్రతి డిస్ట్రిబ్యూటర్ వినియోగదారు నుండి పూర్తిగా నింపబడిన కన్స్యూమర్ అప్లికేషన్ ఫారం (షెడ్యూల్-1) అందుకొని దాని కాపీని వినియోగదారుకు అందజేసిన తరువాత టివి కు సంబంధించిన బ్రాడ్‍కాస్టింగ్ సర్వీసులు అందిస్తారు.

(3) టెలివిజన్ ఛానల్స్ యొక్క ప్రతి డిస్ట్రిబ్యూటర్, సబ్స్క్రైబర్ మేనేజ్‍మెంట్ సిస్టమ్ ఉపయోగించి ప్రతి సబ్స్క్రైబర్ కు ఒక ప్రత్యేక గుర్తింపు నెంబర్ ను కేటాయిస్తారు, దానిని షార్ట్ మెసేజ్ సర్వీస్ (ఎస్ఎంఎస్) ద్వారా సబ్స్క్రైబర్ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు మరియు ఈ-మెయిల్, బి-మెయిల్, నెలవారి బిల్ లేదా చెల్లింపు రసీదు వంటి ఇతర కమ్యూనికేషన్ మాధ్యమాల ద్వారా, తగిన విధంగా సబ్స్క్రైబర్ కు తెలియజేస్తారు.

(4) టెలివిజన్ ఛానల్స్ డిస్ట్రిబ్యూటర్ సబ్స్క్రైబర్ యొక్క కన్స్యూమర్ అప్లికేషన్ ఫార్మ్ వివరాలు సబ్స్క్రైబర్ మేనేజ్మెంట్ సిస్టమ్ లోకి ఎంటర్ చేయబడిన తరువాత మాత్రమే టెలివిజన్ కు సంబంధించిన బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ ను సబ్స్క్రైబర్ కు యాక్టివేట్ చేస్తారు:

(5) టెలివిజన్ ఛానల్స్ డిస్ట్రిబ్యూటర్ సబ్స్క్రైబర్ యొక్క కన్స్యూమర్ అప్లికేషన్ ఫార్మ్ వివరాలు సబ్స్క్రైబర్ మేనేజ్మెంట్ సిస్టమ్ లోకి ఎంటర్ చేయబడిన తరువాత మాత్రమే టెలివిజన్ కు సంబంధించిన బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ ను సబ్స్క్రైబర్ కు యాక్టివేట్ చేస్తారు:

అయితే టివి కు సంబంధించిన బ్రాడ్‍కాస్టింగ్ సర్వీసులు కొరకు చార్జీలను అటువంటి సర్వీసులు యాక్టివేట్ చేయబడిన తేదీ నుండి సబ్స్క్రైబర్ చెల్లించవలసి ఉంటుంది.

(6) టెలివిజన్ ఛానల్స్ డిస్ట్రిబ్యూటర్ సర్వీసులు కు సంబంధించిన బ్రాడ్‍కాస్టింగ్ సర్వీసులు అందించుటకు ఒక కొత్త కనెక్షన్ యొక్క ఇన్స్టలేషన్ కొరకు ఏక-కాల ఇన్స్టలేషన్ ఛార్జ్ గా మూడు వందల యాభై రూపాయలకు మించకుండా వసూలు చేయవచ్చు.

(7) టెలివిజన్ ఛానల్స్ డిస్ట్రిబ్యూటర్ టెలివిజన్ కు సంబంధించిన బ్రాడ్‍కాస్టింగ్ సర్వీసెస్ ను యాక్టివేట్ చేయుటకు ఏక-కాల యాక్టివేషన్ చార్జ్ గా వంద రూపాయలకు మించకుండా వసూలు చేయవచ్చు.